ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్
తిల్లపూడి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టిడిపి మండల కార్యదర్శి పాముల రజినీకుమార్ పాల్గొన్నారు. ఆయన గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలో పారిశుధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, డ్రెయినేజీలు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శించారు. త్వరలోనే సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటి శ్రీరాములు, అందే కోటి వీరభద్రరావు, తెలుగు యువత మండల అధ్యక్షులు నీలం తాతాజీ, దిడ్డల రామానుంజనేయులు, సెక్రటరీ బొప్పనపల్లి రంగారావు, నడపన రంగారావు ఎంపిటిసి సాగ సత్యనారాయణ పాల్గొన్నారు.










