Apr 05,2022 23:16

పౌల్ట్రీ ఫారం ప్రహరీని కూల్చి వేసిన దశ్యం

ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌:
మాజీ టీడీపీ దివంగత గురజాల మహాదేవ నాయుడు పౌల్ట్రీ ఫారం ప్రహరీని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి కూల్చి వేశారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపా రాష్ట్ర నాయ కులు మహదేవ సందీప్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకర్ల సమావేశంలో సందీప్‌ను జిల్లాలో తిరగనివ్వకుండా చేస్తా మని అంతు చూస్తామంటూ హెచ్చరించిన గంటల వ్యవధి లోనే పౌల్ట్రీ ఫారం ప్రహరీ కూల్చివేత సంఘటన చోటు చేసు కుంది. దీంతో చిత్తూరు నగరంలో ఈ సంఘటన చర్చనీ యాంశంగా మారింది. వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ సంఘటనకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నాయకులు మహాదేవ సందీప్‌కు చెందిన