Oct 18,2022 23:28

పూనేపల్లి వద్ద టిక్కో ఇండ్లను పరిశీలిస్తున్న నగర కమిషనర్‌

చిత్తూరుఅర్బన్‌ : నగరపాలక సంస్థ పరిధిలో పూణేపల్లి వద్ద నిర్మిస్తున్న టిడ్కో గహ సముదాయంలో అన్ని పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నగర కమిషనర్‌ అరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం టిడ్కో ఇంజనీర్లు, గుత్తేదారులతో కలిసి టిడ్కో గహాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాల పనుల పురోగతి, పెండింగ్‌ పనులు పూర్తిచేయడం, ఎస్టీపీల నిర్మాణాలపై అధికారులు, గుత్తేదారులతో సమీక్షించారు. పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్ల నిర్మాణం, పైపులైన్లు, విద్యుదీకరణ పనులు మూడు వారాల్లో పూర్తి చేయాలన్నారు, ఎస్టీపీ ల నిర్మాణాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు. వేగంగా పనులు పూర్తి చేస్తేనే సకాలంలో గహాలను లబ్ధిదారులకు అందించగలమని, ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకొని పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడ్కో ఈఈ వెంకట మునీంద్ర, డీఈ రమణ, మెప్మా సీఎంఎం గోపి, ఎంఈ సాయి స్వర్ణ కుమార్‌, టిడ్కో కోఆర్డినేటర్‌ ధనంజయ రెడ్డి, గుత్తేదారులు పాల్గొన్నారు.