Oct 26,2023 19:48

టిడిపిలో చేరిన ముస్లిములతో ఇంటూరి

ప్రజాశక్తి-కందుకూరు :పట్టణంలో 18వ వార్డు బూడిదపాలెంకు చెందిన పలువురు ముస్లిములు గురుóవారం టిడిపిలో చేరారు. వైసిపికి చెందిన షేక్‌ ఫాజిల్‌, షేక్‌ షాకీర్‌ సహా పలు కుటుంబాల వారు టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో జగన్‌ మోహన్‌ రెడ్డిని నమ్మి ఓట్లు వేశామని, వైసిపి పాలనంతా దారుణంగా ఉందన్నారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరికలు భారీ స్థాయిలో ఉంటాయని, పార్టీ నాయకులు అంతా కలిసి మెలిసి పార్టీ కోసం కష్టపడాలని సూచించారు పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు నరగ జయకష్ణ, వార్డు నాయకులు సయ్యద్‌ జియావుద్దీన్‌, షేక్‌ బాబు, రాహుల్‌, చంటి, నాగరాజు సింగ్‌, సుభాని, రావి జాలయ్య, మహబూబ్బాషా, గనిపినేని నరసింహారావు, రబ్బాని, సోహెల్‌, అహ్మద్‌, మొహిసిన్‌, అరాఫత్‌, బాబు, మహబూబ్‌ బాషా, కరీముల్లా, యాసిన్‌, సుల్తాన్‌, పైరోజ్‌, దేవా ఉన్నారు.