Oct 22,2023 18:01

టిడిపిలో చేరిన వారితో ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు నియోజకవర్గంలోని మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో 6 కుటుంబాలు ఆదివారం టిడిపిలో చేరాయి. కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో వారంతా పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన బాలరాజు నాగార్జున, బాలరాజు రామకష్ణ, దామా రవి, జడ శ్రీకాంత్‌, పూరిమిట్ల బ్రహ్మయ్య, యశ్వంత్‌ కుటుంబాల వారు చేరి వారందరికీ నాగేశ్వరరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసిపి పని అయిపోయిందన్నారు. ఆ పార్టీ దోపిడీ విధానాన్ని చూసి అనేకమంది పార్టీని వీడుతు న్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోం దన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు చావా వెంకటేశ్వర్లు, కిలారి సుబ్బరాయుడు, వీరంరాజు, రాజశేఖర్‌, టెంకం మల్లికార్జున, బంగారు, మండల బీసీ సెల్‌ అధ్యక్షుడు మద్దసాని కష్ణ , పార్టీ నాయకులు చిత్తారి మల్లికార్జున, కొండలరావు ఉన్నారు.