Oct 09,2023 20:51

మాట్లాడుతున్న టిడిపి నాయకులు

మాట్లాడుతున్న టిడిపి నాయకులు

టిడిపి వినూత్న నిరసన
గేదె మెడలో వాల్‌పోస్టర్‌
ప్రజాశక్తి-నెల్లూరు అర్బన్‌ :చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తూ..మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొంగూరు నారాయణ సూచనల మేరకు... టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద బాబుతో మేము సైతం... దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, స్వచ్ఛంధంగా ప్రజలు పాల్గొని... బాబుతో నేనంటూ...మద్దతు తెలిపారు. ఇందులో భాగంగా... కోటంరెడ్డి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. గేదె మెడలో పాలిచ్చే గేదెల్లారా...మీరన్నా పరిపాలించడం నేర్పండి ఈ మూర్ఖపు దున్నపోతు జగన్‌ రెడ్డికి అంటూ వాల్‌ పోస్టర్‌ వేశారు. అవినీతి బురదలో పొర్లాడే జగన్‌ రెడ్డి.. ఆ బురద అందరికి పులమాలనుకోవడం సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు.
జగన్మోహన్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అతనికి ఎలాగో రాష్ట్రాన్ని పరిపాలించడం రాదమ్మా...గేదె తల్లి...కనీసం నువ్వైనా చెప్పమా...దున్నపోతు జగన్‌ రెడ్డి అంటూ తనదైనశైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.