Oct 26,2023 22:50

విశ్వప్రసాద్‌

ప్రజాశక్తి- బూర్జ: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌ను నియమించినట్లు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుండి గురువారం నియాక పత్రం విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశ్వప్రసాద్‌ను సాలూరు నియోజకవర్గానికి ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. ఈయన గతంలో ఎమ్మెల్సీగా, ఎంపిపిగా, తోటవాడ గ్రామ సర్పంచ్‌గా ఎన్నో పదవులను చేపట్టారు. ఈయన బూర్జ మండలంలోనే కాకుండా జిల్లాలో కూడా మంచిపట్టు సాధించారు. మండలంలో ఆమదాలవలస నియోజకవర్గంలో టిడిపి బలోపేతం అయ్యేందుకు అహర్నిశలు కృషి చేశారు. పీరుకట్ల విశ్వప్రసాద్‌ సాలూరు నియోజక వర్గ ఎన్నికల పరిశీలకులుగా నియామకంతో సాలూరు నియోజకవర్గంలో టిడిపి బలం పెంచుకుంటుందని, 2024లో టిడిపి ఘన విజయం సాధిస్తుందని టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.