Oct 14,2023 18:00

మాట్లాడుతున్న టిడిపి అధ్యక్షులు సురేష్‌ రెడ్డి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయు డు కోసం రక్తం చిందించేందుకైనా సిద్ధమని టీడీ పీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్‌ రెడ్డి స్ప ష్టం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిర సిస్తూ శనివారం సురేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టడం జరిగింది. ఈ సంద ర్బంగా సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని తప్పు డు కేసులు పెట్టినా, ఎన్ని పీటీ వారెంట్లు ఇచ్చి నా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారన్నారు. కోర్టులో జరిగిన వాదోపవాదాల ను ప్రపంచం మొత్తం చూస్తోందని సురేష్‌ రెడ్డి చెప్పారు. చంద్రబాబు రిమాండ్‌ ఎంత అక్రమ మో ప్రజలు తెలుసుకుంటున్నారని అన్నారు. తప్పుడు పనులు చేసిన వారు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారన్నారని సురేష్‌ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ పోస్ట్‌ కార్డ్‌ ఉద్యమం ద్వారా సుప్రీంకో ర్టు న్యాయమూర్తికి లేఖలు స్థానిక పోస్ట్‌ ఆఫీస్‌ ద్వార పంపుతున్నామన్నారు. న్యాయం అందరి కీ సమానంగా ఉండాలని సురేష్‌ రెడ్డి చెప్పారు. అనేక కేసులలో నిందితుడుగా వున్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిబెయిల్‌ పై ఉన్నాడని అతని బెయిల్‌ రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సేవ్‌ ఆంధ్ర ప్రదేశ్‌ ,సేవ్‌ డెమోక్రసీ'' అంటూ నినాదాలు చేశారు. చంద్రబా బు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ పోస్ట్‌ కార్డులు'' రా యాలని ప్రజలకు సురేష్‌ రెడ్డి పిలుపునిచ్చారు.స్థానిక నేత మాజీ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్‌ మద్దిన గోపాల్‌ నాయుడు సూచనతో నిర్వహించిన పో స్ట్‌ కార్డ్‌ ఉద్యమంలో టిడిపి నేతలు చుక్కపల్లి మల్లికార్జున నాయుడు, చావా రమేష్‌, గుడ్లూరు గోపాల్‌ నాయుడు, మోహన్‌ రావు నాయుడు, చల్ల వెంకట శ్రీధర్‌, వేళ్ళ సోదరులు, మాలపాటి శ్రీనివాస్‌ నాయుడు, వల్లభనేని సతీష్‌, గుడ్లూరు శ్రీధర్‌, పచ్చ పశుపతి, నాశన గిరీష్‌, బుట్టి మల్లి కార్జున, పరుచూరు సీనమ్మ, త్రోవగుంట శివ య్య, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొ న్నారు.