Oct 15,2023 22:39

ఫొటో : నిరసన చేపడుతున్న టిడిపి నాయకులు

టిడిపి నేతల నిరసన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పట్టణంలోని మున్సిపల్‌ బస్టాండ్‌ వద్ద ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. ఆత్మకూరులో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమం పోరెత్తించారు. చేతులకు తాళ్లు రిబ్బన్లతో సంకెళ్లు వేసుకొని రాత్రి ఏడు గంటలకు మున్సిపల్‌ బస్టాండ్‌ వద్ద నుండి వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
బిఎస్‌ఆర్‌ సెంటర్లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పులిమి శైలజా రెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రా రెడ్డి, చండ్రా వెంకటసుబ్బ నాయుడు, మండల రూరల్‌ అధ్యక్ష కార్యదర్శులు సుంకర పెంచలయ్య చౌదరి, కౌన్సిలర్లు గౌస్‌ బాషా, సూరా భాస్కర్‌రెడ్డి, మాదాల శ్రీనివాస నాయుడు, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, మధు, జయకర్‌, తదితరులు పాల్గొన్నారు.