Aug 10,2023 21:26

గుత్తి చెరువు వద్ద సెల్ఫీ దిగుతున్న టిడిపి నాయకులు

        ప్రజాశక్తి-గుత్తి    టిడిపి ప్రభుత్వ హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించామని టిడిపి జిల్లా అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం చేపట్టిన యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా టిడిపి నాయకులు గురువారం గుత్తి చెరువును సందర్శించారు. ఇందులో భాగంగా చెరువు వద్ద సెల్ఫీ తీసుకుని వైసిపి నాయకులకు ఛాలెంజ్‌ విసిరారు. అనంతరం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు నమ్మడం లేదన్నారు. ఇక ప్రజలు, రైతులు ఎలా నమ్ముతారన్నారు. 2014-19లో తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, నీరు చెట్టు పథకం కోసం రూ.68,293 కోట్లు వెచ్చించామన్నారు. వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లలో రూ. 22,650 కోట్లు మాత్రమే సాగునీటి వ్యవస్థ కోసం విడుదల చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు ఇంటికి సాగనంపుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆర్‌.జితేంద్ర గౌడ్‌, ప్రభాకర్‌చౌదరి, ఉన్నం హనుమంతురాయచౌదరి, టిడిపి నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఆర్‌.పవన్‌ కుమార్‌గౌడ్‌, వెంకటశివుడు యాదవ్‌, టిడిపి మండల, పట్టణ కన్వీనర్లు బర్దివలి, రవిశంకర్‌, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్‌చౌదరి, మాజీ మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ మోడే శ్రీనివాస్‌యాదవ్‌, టౌన్‌బ్యాంకు ఉపాధ్యక్షుడు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.