Jul 02,2023 21:34

సీసీ రోడ్ల నిర్మాణ శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, నాయకులు

          ప్రజాశక్తి-అనంతపురం   తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని యాత్రలు చేసినా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో విశ్వాసం తగ్గదని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలోని 2వ డివిజన్‌లో 1.91 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అనంతపురం నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకెళ్తున్నామన్నారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి టిడిపి నాయకులు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి నగరంలో ఎక్కడ చేసినా రోడ్లన్నీ గుంతలమయమై.. కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఎన్ని కల సమయంలో తాము ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నాలు గేళ్లలో అభివృద్ధి చేసి చూపించామన్నారు. రూ.650 కోట్లతో పను లు చేపట్టి అనంతపురం రూపురేఖలు మార్చివేశామన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి సచివాలయానికీ మం జూరైన రూ.20 లక్షల చొప్పున అనంతపురం నగరానికి రూ.15 కోట్లు వచ్చాయన్నారు. వీటితోపాటు జనరల్‌ ఫండ్స్‌, ఆర్థిక సంఘ ం నిధులు, ఎంపీ నిధులు, స్పెషల్‌ గ్రాంట్స్‌తో పనులు చేస్తున్నామ న్నారు. 2వ డివిజన్‌లో ఏకంగా రూ.4 కోట్లతో అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టినట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ మార్గ్‌కు గత పాలకులు పేరు పెట్టుకోవడం తప్పితే చేసిందేమీ లేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే పనులు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. కాగా అధికారంలో ఉండి ఏమీ చేయలేని పాలకులు.. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో నాయకులు మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు.
టిడ్కో ఇళ్ల విషయంలోనూ అపద్ధాలు
నగరంలో టిడ్కో ఇళ్ల విషయంలోనూ అపద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు లబ్ధిదారులతో డబ్బులు వసూలు చేసి నిర్మాణాలు పూర్తి చేయలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చే సమయానికి కనీసం ప్లింత్‌ దశలో కూడా ఇళ్లు లేవని చెప్పారు. కానీ టీడీపీ హ యాంలోనే 90 శాతం పూర్తి చేసినట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తు న్నారని మండిపడ్డారు. 2304 మందికి టిడ్కో ఇళ్లను త్వరలోనే అందిస్తామని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ల కోసం డీడీలు కట్టిన వారికి కూడా డబ్బులు తిరిగి ఇస్తామని తెలిపారు. ఇప్పటికే వారికి వేరే చో ట ఇంటి స్థలాలు ఇచ్చినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మేయర్‌ మహహ్మద్‌ వసీం, కమిషనర్‌ రమణారెడ్డి, డిప్యూటీ మేయర్లు వాస ంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్లు లీలావతి, సుమతి, లక్ష్మీదేవి, దేవి, కమల్‌భూషణ్‌, అనిల్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, బాబా, జేసీఎస్‌ కన్వీనర్‌ బోయ లక్ష్మన్న, డివిజన్‌ కన్వీనర్‌ రవి, వైసిపి నాయకులు గంగాధర్‌, రాజా, రామకృష్ణ, నాగేంద్ర, అల్తాఫ్‌, ఆది, సుధాకర్‌, కృష్ణ, హరి, అమర్‌ పాల్గొన్నారు.