Oct 04,2023 19:41

కందుకూరులో దీక్ష చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-కందుకూరు :25 రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్న టిడిపి అధినేత, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా కందుకూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అయిన మరుసటి రోజు నుంచే ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. అప్పటినుంచి చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 22వ రోజుకు చేరాయి. అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారని టిడిపి శ్రేణులు చెబుతున్నారు. ప్రధానంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. బుధవారం దీక్షల ముగింపు సందర్భంగా ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టు పట్ల ప్రజల్లో ప్రభుత్వంపై ఊహించని వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆయనను అన్యాయంగా జైలుకు పంపారని ప్రతి ఒక్కరూ నిశ్చిత అభిప్రాయంతో ఉన్నారన్నారు. చంద్రబాబు గొప్పతనం గురించి చెప్పడానికి ఎంత సమయమైనా సరిపోదన్నారు. భవిష్యత్తుపై పాతికేళ్ల ముందే అంచనా వేయగల అనుభవజ్ఞుడని కొనియాడారు. ప్రతిపక్షం బలం పుంజుకుంటున్న విషయాన్ని పసిగట్టిన మహీధర్‌ రెడ్డి, ఇటీవల కాలంలో అన్ని మండలాల్లో టిడిపి నేతలను టార్గెట్‌ చేశారన్నారు. అలాంటి ఉడత బెదిరింపులకు తాము భయపడేదే లేదని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిశీలకురాలు కుసుమకుమారి మాట్లాడుతూ, దీక్షలకు పెద్దఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శీను, క్లస్టర్‌ ఇంచార్జ్‌ లు చిలకపాటి మధుబాబు,పిడికిటి రఘనాధరావు, వడ్డెళ్ళ రవిచంద్ర, బొద్దులూరి కొండలరావు, ఉమ్మనేని సుబ్బారావు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, బెల్లం కష్ణమోహన్‌, సుదర్శి శ్రీనివాసులు, నాయకులు నాదెళ్ల వెంకట సుబ్బారావు, గోచిపాతల మోషే, షేక్‌ రఫీ, కూనం నరేంద్ర, రెబ్బవరపు మాల్యాద్రి, రాయపాటి శ్రీనివాసరావు, షేక్‌ మున్నా, వలేటి నరసింహం, సోంపల్లి మనోహర్‌, చింతల సింగయ్య, బెల్లంకొండ సింగయ్య, రావుల రవి, బద్దిపూడి శిఖామణి ఉన్నారు.