తహశీల్దార్‌కు సత్కారాలు చేస్తున్న దృశ్యం
తహశీల్దార్‌కు సత్కారాలు
ప్రజాశక్తి-ఉదయగిరి:తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన సానా శ్రీనివాసరెడ్డిని వైసీపీ నాయకులు సత్కారాలు చేశారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆయనను సర్పంచ్ సంఘ అధ్యక్షులు కల్లూరి వెంకటేశ్వర రెడ్డి, మండల కన్వీనర్ సీఎం ఓబుల్ రెడ్డి మాజీ సర్పంచ్ ఆక్కుల రెడ్డి వక్స్ బోర్డ్ డైరెక్టర్ ఎస్దాని వైసీపీ శ్రేణులతో ఆయనను శాలవాలు పూలమాలతో ఘనంగా సత్కరించారు. మెట్ట ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై సత్వరమే సమస్యలు పరిష్కరించాలని మరల తహశీల్దార్ గా ఉదయగిరి కి రావడం మండల ప్రజల కు అదష్టమన్నారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్, సీనియర్ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ గౌస్ మొహిద్దీన్, వెంగళరెడ్డి, మట్ల రామయ్య, లక్ష్మయ్య, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.










