ఇన్‌ఛార్జి తహశీల్దారుగా జరీనా
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
భూ అక్రమాల కేసులో ఆయనపై ఏసీబీ అధికారులు విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఆ మేరకు వారు జిల్లా కలెక్టర్‌కు నివేదికను అందజేశారు. ఈ నేపథ్యంలో తహశీల్దారు పరమేశ్వరస్వామిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో శ్రీకాళహస్తి తహశీల్దారు జరీనాను ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు. గత నెల 26, 27వ తేదీలలో తొట్టంబేడు తహశీల్దారు కార్యాలయంపై తిరుపతి ప్రాంత ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఆ దాడుల్లో తొట్టంబేడు మండలంలో రెవెన్యూ అధికారులు చేసిన భూ అక్రమాలు అనేకం వెలుగు చూశాయి. వాటిలో మచ్చుకు కొన్ని మీడియా ముందుకు కూడా వచ్చాయి. మరిన్నింటిని ఏసీబీ అధికారులు గోప్యంగా ఉంచి జిల్లా కలెక్టర్‌కు నివేదిక రూపంలో పంపారు. ఆ పిదప చర్యల్లో భాగంగా తొలుత తహశీల్దారుపై కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. తహశీల్దారుతో పాటు మరో ఇద్దరు అధికారులు, ముగ్గురు వీఆర్వోలు కూడా భూ అక్రమాల్లో పాలుపంచుకున్నట్లుగా ఏసీబీ అధికారులు విచారణలో తేలింది. ఈ క్రమంలో మొదటగా తహశీల్దార్ వికెట్ పడటంతో ఇక తమవంతేనంటూ తక్కిన వారు వణికిపోతున్నారు. కలెక్టర్ చర్యలతో తొట్టంబేడు మండలంలోని భూ బాధితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.










