తహశీల్దార్ ఆఫీసులో 'ఏసీబీ' విచారణ
ప్రజాశక్తి- గుడిపల్లి:
మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి తహశీల్దార్ గుర్రప్ప తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెలలో 114400 సోడిగానిపల్లి గ్రామపంచాయతీ నుండి ఏసీబీ అధికారులకు భూమి పాసుపుస్తకం కొరకు లంచం అడుగుతున్నారని ఒక రైతు ఆపంచాయతీ వీఆర్‌ఓ, సచివాలయ సర్వేర్‌లపై ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఏసీబీ అధికారులు మంగళవారం కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారని తెలిపారు. అనంతరం వారికి పూర్తి వివరాలను అందించాలని తమకు, ఎంపీడీఓ శంకర్‌కు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.










