Jun 28,2023 21:38

ప్రజలతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విశ్వ

    బెళుగుప్ప : మండల పరిధిలోని తగ్గుపర్తి గ్రామంలో బుధవారం నిర్వహించిన 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ముందుగా వైసిపి నాయకులు విశ్వకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విశ్వ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే మహిళలతో కలిసి సీఎం జగన్మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.