విద్యార్థులతో మాట్లాడుతున్న డిఇఒ నాగరాజు
ప్రజాశక్తి-అనంతపురంసిటీ ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డిఇఒ వి.నాగరాజు ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం అనంతపురం రూరల్ మండలం కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డిఇఒ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా నాడు-నేడు-2 పనులను పరిశీలించారు. తర్వాత 7వ తరగతి, 10వ తరగతి విద్యార్థుల నోటు పుస్తకాలను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంని ఆదేశించారు. అలాగే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం, టీచర్లు పాల్గొన్నారు.










