Mar 27,2023 21:15

ప్రజాశక్తి - తణుకురూరల్‌
కార్మికుల పొట్టలు కొట్టే టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని, కార్మికులకు పాత పద్ధతిలో అగ్రిమెంట్‌ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని స్థానిక ఎపి సీడ్స్‌ వద్ద కార్మికులు అర్ధనగంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ ఎక్కడా లేని టెండర్‌ విధానాన్ని తణుకు సీడ్స్‌లో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. మూటలు మోసుకుని జీవనం సాగిస్తున్న వారి పొట్టలు కొట్టడం సరికాదని తెలిపారు. కార్మికుల జీవితాలు చాలా చిన్నవని, వారికి హనీ చేస్తే చూస్తూ ఊరుకోబోమని, సమస్య పరిష్కారం కాకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.దక్షిణామూర్తి, గార రంగారావు, టి.రామకృష్ణ, జి.త్రిమూర్తులు, కె.వరలక్షి, ఎన్‌.లక్ష్మి పాల్గొన్నారు.