Mar 20,2023 21:07

ప్రజాశక్తి - తణుకురూరల్‌
టెండర్‌ విధానాన్ని ఆపాలని, పాత పద్ధతినే కొనసాగించాలని ఎపి సీడ్స్‌ హమాలీస్‌, మహిళా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు టి.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఎపి సీడ్స్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో టెండర్‌ విధానాన్ని నిరసిస్తూ నాలుగో రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎపి సీడ్స్‌లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, ఎక్కడా లేని విధంగా తణుకు యూనిట్‌లో టెండర్‌ విధానాన్ని తీసుకురావడం అన్యాయమన్నారు. కార్మికుల పొట్ట కొట్టే టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే అగ్రిమెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జి.త్రిమూర్తులు, కె.వరలక్ష్మి, జి.రూతమ్మ, వెంకటరమణ, సాంబశివరావు, శ్రీహరి పాల్గొన్నారు.