
నూరల్‌కుమార్, టెక్కలి సబ్ కలెక్టర్
ప్రజాశక్తి - టెక్కలి: టెక్కలి సబ్ కలెక్టర్‌గా నూరల్ కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకొండ సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నూరల్ కుమార్ బదిలీపై ఇక్కడికి రానున్నారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్ కుమార్ రెడ్డి జాయింట్ కలెక్టర్‌గా నంద్యాల జిల్లాకు బదిలీ అయిన విషయం విదితమే. ఆయన స్థానంలో ఇప్పటివరకు ఇన్‌ఛార్జిగా పలాస ఆర్‌డిఒ సీతారామయ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.