పోలీసు శునకానికి ఘనంగా వీడ్కోలు
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
జర్మన్ షెప్పర్డ్ ఐదో పోలీసు శునకం (స్నెఫ్ఫెర్‌డాగ్) 2009లో జన్మించింది. 2010 మార్చి నుంచి చిత్తూరు పోలీసు శాఖలో డాగ్‌స్క్వాడ్‌లో సేవలు అందించింది. విఐపి, వివిఐపిల సేవలో తరించింది. కాణిపాకం, తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలోనూ సంఘ విద్రోహ చర్యల నివారణ కోసం ఈ శునకాన్ని తనిఖీలకు ఉపయోగించేవారు. దీని సేవలకు గుర్తుగా గోల్డ్‌మెడల్‌తో సత్కరించారు. 2010 నుంచి 2022 వరకూ పోలీసు డిపార్టుమెంట్‌లో సేవలు అందించి మంగళవారం ఉద్యోగ విరమణ చేసింది. స్వయంగా డిఐజి సెంథిల్‌కుమార్ ఈ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని సన్మానం చేశారంటే తారా సేవలు పోలీసు డిపార్టుమెంట్‌కి ఎంతగా ఉపయోగపడ్డాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ఎఎస్‌పి మహేష్, విద్యాసాగర్‌నాయుడు, డిఎస్‌పి సుధాకర్‌రెడ్డి, శ్రీనివాసులు, ఏఆర్ డిఎస్‌పి లక్ష్మినారాయణరెడ్డి, కృష్ణమోహన్, నీలకంట, రఘు పాల్గొన్నారు.










