మోటర్, పైప్‌లైన్ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రోజా
మోటర్, పైప్‌లైన్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా
ప్రజాశక్తి- నగరి: నగరి మండలంలోని బుగ్గఅగ్రహారం గ్రామానికి చాలా రోజులుగా ఉన్న తాగునీటి సమస్యను గుర్తించి వారికి ముక్కు కొండ దిగువ భాగాన బోర్ వేయించి మోటార్, పైపులైన్లను బిగించి వారి సమస్యను తీరుస్తానని ఎమ్మెల్యే గతంలో చెప్పడం జరిగింది. దాని ప్రకారం జిల్లా పరిషత్ ఏర్పడగానే మొదటి పనిగా జిల్లా పరిషత్, మండల నిధుల నుంచి శుక్రవారం రూ.20 లక్షల అంచనాతో చేయిస్తున్న పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజు భార్గవి, వైస్ ఎంపీపీ 2, కన్నెప్పన్, తిరుమల రెడ్డి, బుజ్జి రెడ్డి, చంద్రకళ, ప్రకాశ్ ఎంపీటీసీలు, నాయకులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు తదితరులు పాల్గొన్నారు.










