సర్పంచి డొక్కు సోమేశ్వరరావు
పెదఅమిరంలో తాగునీటి చెరువు పనులు
ప్రజాశక్తి - కాళ్ల
పెదఅమిరం గ్రామస్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అబ్బాయి తాగునీటి చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నాలుగు రోజుల నుంచి బలహీనంగా ఉన్న చెరువు గట్లను పటిష్టపర్చే పనులు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఆయా పనులను గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇటి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచి సోమేశ్వరరావు మాట్లాడుతూ తాగునీటి చెరువులోకి నీటిని పూర్తిస్థాయిలో నింపుతామన్నారు. కోనేరు చెరువు, కొత్తచెరువు, అబ్బాయి చెరువులోకి నీటిని పూర్తిస్థాయిలో నింపి ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ10 లక్షలతో ఫిల్టర్ బెడ్ మరమ్మతులు చేపడుతున్నామన్నారు.










