Oct 14,2023 21:32

ఫొటో : పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్న దృశ్యం

తాగునీటి కోసం పైప్‌లైన్‌ ప్రారంభం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : మండలంలోని పడకండ్ల పంచాయతీ మజరా బొటికర్లపాడు గ్రామ ఎస్‌సి కాలనీలో తాగునీటి కోసం పైపులైన్‌ పనులు ప్రారంభించామని సర్పంచ్‌ మాముడు నరసింహులు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గతంలో ఎస్‌సి కాలనీలో ఉప్పునీటి సమస్య ఉండడంతో స్థానిక ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి చొరవతో కావేరి వాగులో బోరు వేసి ఆ గ్రామానికి మంచినీటిని సరఫరా చేసేందుకు జల్‌ జీవన మిషన్‌ ద్వారా బొటికర్లపాడు ఎస్‌సి కాలనీకి మంచినీటి కొళాయిలను వేసేందుకు శనివారం పైప్‌లైన్లు వేసి ప్రారంభించినట్లు సర్పంచ్‌ తెలియజేశారు.
స్థానిక ప్రజలు మంచినీటిని కాలనీకి సరఫరా చేసేందుకు స్థానిక ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి చొరవతో ఈ పనులు చేయడంతో గ్రామస్తులు ఎంఎల్‌ఎకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు నాయబ్‌ రసూల్‌, తుమ్మల శ్రీనివాసులు రెడ్డి, దొడ్ల వెంకటేశ్వర్లు, ఉలవ కొండయ్య, గుర్రాల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.