తాగునీరు వృథా!
తాగునీరు వృథా!
పట్టని అధికారులు
ప్రజాశక్తి - పాలసముద్రం: మండల కేంద్రమైన వనదుర్గాపురం పంచాయతీ హరిజనవాడ సమీపంలో దాదాపు 200 ఇళ్లకు వెళ్లేలా గేట్‌వాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ గేటు వాళ్ళు 7నెలలుగా మరమ్మతులకు గురవడంతో తాగునీరు వృథాగా పోతోంది. రాత్రి పగలు తేడా లేకుండా తాగునీరు వథాగా పోతున్నాయని అరికట్టాలని గ్రామస్తులు అధికారులకు తెలిపిన పట్టించుకునే నాధుడే కరువయ్యారు. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. వృథాగా పోతున్న తాగునీటి గేట్ వాల్‌కు మరమ్మతు పనులు చేపట్టకుండా పంచాయతీ అధికారి సర్పంచ్ కాలయాపన చేస్తున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి వృథాగా పోతున్న తాగునీటిని అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.










