Apr 20,2023 21:35

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
సిపిఎం, సిపిఐ ప్రచారభేరి యాత్ర ముగింపు సందర్భంగా గురువారం ఎస్‌విఆర్‌ విగ్రహం వద్ద నుంచి పెంటపాడు వరకు మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా నాయకులు సీతారాం ప్రసాద్‌ మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో శుక్రవారం నిర్వహించే సభను జయప్రదం చేయాలని కోరారు. స్వాతంత్రోద్యమంలో కనీస పాత్రలేని వారు దేశాన్ని పాలించడం సిగ్గుచేటని వారన్నారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి మోడీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, ఇరుపార్టీల నేతలు మడకా రాజు, కరెడ్ల రామకృష్ణ, శిద్దిరెడ్డి శేషుబాబు, చిట్టేటి సత్యనారాయణ, పోతు శ్రీను, అల్లం రాము, దాస్యం రాము, రావూరి బాబీ, ఉయ్యూరి సత్యనారాయణ పాల్గొన్నారు.