
- సువర్ణ (తల్లిదండ్రులని) ని సన్మానించిన డి.ఎస్.పి (దిశా) వాసుదేవ్ పోలీస్ సిబ్బంది
ప్రజాశక్తి-నౌపడ : శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మారుమూల గ్రామం ఆకాశలకవరం పంచాయతీ ఇదే గ్రామానికి చెందిన పరపటి.ధర్మారావు చంద్రకళ కుమార్తె సువర్ణ ఇటీవలే గ్రూప్ వన్ లో డిప్యూటీ కలెక్టర్ గా విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లాకే కాదు గ్రామానికి పేరు సంపాదించి పెట్టిన సువర్ణ బుధవారం ఈమె తమ తల్లిదండ్రులతో పాటు (ధర్మారావు చంద్రకళ) అదే పంచాయతీ సుగ్గువానిపేట కి చెందిన పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న దిశ డిఎస్పి శ్రీకాకుళం ఎస్ వాసుదేవ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. డీఎస్పీ వాసుదేవ్ స్వాగతిస్తూ ఆమెను తల్లిదండ్రులను సాలువతో సన్మానించి అభినందించారు. కాసేపు ముచ్చటిస్తూ జిల్లాకే కాదు గ్రామానికి గర్వకారణం తెచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజలకు మంచి సేవలు అందించి (సర్వీస్) ప్రజలు అభినందనలు పొందాలని డి.ఎస్.పి వాసుదేవ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చంద్రకళ పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.