Jun 21,2023 12:26
  • కొలతల కో  "రేటు" వారి రూటే  సపరేటు

 ప్రజాశక్తి-ఆత్మకూరు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు అత్యంత త్వరగా సేవలందించాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రామ సర్వేయర్ల నిర్వాకం  ఇష్ట రాజ్యాంగ  కొనసాగుతోందనడానికి ఆత్మకూరు మండలంలో పలు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ సర్వే అందుకు నిదర్శనమని ఆరోపణ బలంగా వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండలంలో గల దాదాపు 11 సచివాలయాల్లో  విధులు నిర్వర్తిస్తున్న  గ్రామ సర్వేయర్ల నిర్వాకమే   ఇందుకు తార్కాణం. ఇటీవల ఆత్మకూరు మండల కేంద్రంలోని సచివాలయం 2లో ఓ గ్రామ సచివాలయ   సర్వేయర్   హైవే సమీపంలో , 25 సెంట్లు  స్థలం సర్వే చేయడానికి, ఆపన్నంగా 5000 రూపాయలు డిమాండ్ చేయడం విచారకరమని, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతే కాకుండా, మండల రెవెన్యూ అధికారులు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ గ్రామ స్థాయి అధికారులు, కు తెలియకుండానే , అధికారుల అనుమతి లేకుండానే, పొలం సర్వే స్కెచ్ ల కోసం, వేలాది రూపాయలు అక్రమంగా   దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే ఆత్మకూరు మండలంలో ,  మండల తాసిల్దార్ రెగ్యులర్గా విధులకు రాకపోవడంతో, గ్రామ సర్వేయర్ లో  విధి నిర్వహణకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని,  గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 మండలంలోని పలువురు   గ్రామ రెవెన్యూ కార్యదర్శులు కూడా, రెగ్యులర్ తాసిల్దార్ లేకపోవడంతో, భూపట్టాదారు పాస్ పుస్తకాలు చేర్పులు మార్పులు కోసం వేలాది రూపాయల దండుకొని, అక్రమంగా వసూలు చేసినట్టు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఆత్మకూరు మండల రెవెన్యూ వ్యవస్థపై, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు  స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు,ఆరోపిస్తున్నారు.