- భౌతికాయానికి నివాళులర్పించిన ఎంపీపీ
ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండలలోని పాతపేట పంచాయతీ కుప్పనపల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రామకృష్ణ గౌడు కొంతకాలంగా అనారోగ్యంతో ఉండేవాడు సోమవారం రాత్రి ఆయన గృహం వద్దనే స్వర్గస్తులైనారు. ఇది తెలుసుకున్న జిల్లా ఎంపీపీల అధ్యక్షులు స్థానిక ఎంపీపీ మగసాల రెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకొని రామకృష్ణ గౌడు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎంపీపీ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో ఆయన వైఎస్ఆర్ పార్టీ చేసిన సేవలు మరువలేనివని మంచి నాయకున్ని కోల్పోతున్నామని ఆయన అక్కడికి వచ్చిన వారికి తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. జిల్లాఎంపీపీలో అధ్యక్షులు మగసాల రెడ్డప్ప. స్థానిక సర్పంచ్ మమతా రవిచంద్రన్. మండల పరిధిలోని సర్పంచ్ . ఎంపీటీసీలు వార్డ్ వాలంటీర్స్ మండల పరిధిలోని వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










