Feb 08,2023 15:56
  •  ఎం ఎల్ ఏ వెంకటేగౌడ, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

 ప్రజాశక్తి-వి కోట : రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందు నడిపించే ప్రభుత్వా నికి  ప్రజలు అండగా నిలవాలని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ ,చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన వీకోటలోని సెంటర్ బస్టాండ్ వద్ద  గ్రామపంచాయతీ  సర్పంచ్ పి యన్  లక్ష్మమ్మ ఆధ్వర్యంలో  నూతనంగా నిర్వహించిన ఎస్సార్ మినీ షాపింగ్ కాంప్లెక్స్-2 దుకాణ సముదాయాన్ని ఎమ్మెల్యే ,జడ్పీ చైర్మన్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో  రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  సహకారంతొ అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వైసీపీ ప్రధాన కార్యదర్శి పిఎన్ నాగరాజు చొరవతో  వీకోట మేజర్ పంచాయతీలో అభివృద్ధి జరుగుతోందని దీనికి సహకరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో వీకోట గ్రామపంచాయతీ  రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా నిలుస్తుందని దానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. పట్రపల్లి సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రతిగడపకు వెళ్లి ప్రభుత్వపరంగా వారికి అందుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల పథకం లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించారు. సచివాలయ పరిధిలో గ్రామపంచాయతీ వారు గుర్తించిన అన్ని వీధులలో సిసి రోడ్లు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తామని పిఎన్ నాగరాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో వీరి వెంట ఎంపీపీ యువరాజ్, పలమనేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీలు లక్ష్మణ్ రెడ్డి ,తమీంఖాన్ , రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలగురునాద్, సింగిల్ విండో చైర్మన్ దవనంభక్త, ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ అమర్నాథ్, ఎంపీడీవో బాలాజీ ఇ ఓ యాదవపతి తో పాటు   పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు