Jul 10,2023 15:07

ప్రజాశక్తి-ఆత్మకూరు : సిపిఐ రాప్తాడు నియోజకవర్గం సహాయ కార్యదర్శి జి శ్రీకాంత్ ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు పది వేలు సాగు సాయం తెలంగాణ ప్రభుత్వ తరహాలో ఇవ్వాలని ఆత్మకూరు తాసిల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే  దీక్షలు  చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని సిపిఐ రాప్తాడు నియోజకవర్గం సహాయ  కార్యదర్శి జి శ్రీకాంత్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక, అకాల వర్షాలు వలన ,అతివృష్టి, అనావృష్టి వలన రైతులు అప్పులు ఊబిలో కూరుకు పోవుతున్నారని, ఆత్మహత్యలు పరంపర కొనసాగుతున్నది, వలసలు బాట నిరంతరం ఆనవాయితీగా మారినది. అందుకోసం రైతులను ఆదుకోవడం కోసం సాగు సాయం కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు పదివేల  రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. 

  • ప్రధానమైన డిమాండ్స్

1. రైతుకు, కౌలు రైతులకు సాగుసాయం కింద పదివేల రూపాయలు ఇవ్వాలి.
2. రెండు లక్షల రూపాయలు వరకు ప్రతి రైతుకు మాఫీ చేయాలి.
3. కేరళ ప్రభుత్వ తరహాలో రుణ విముక్తి చట్టాన్ని తీసుకుని రావాలి.
4. 50 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి రైతుకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి.
5. ప్రతి పంటకు వాతావరణ బీమా వర్తింప చేయాలి.
6. సాగు చేస్తున్న ప్రతి రైతుకు సాగు పట్టాలి ఇవ్వాలి.
7. పాడి పశువులకు బ్యాంకులలో 50% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి.
8. స్పీంకర్స్ ,డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇవ్వాలి.
    తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు  చేపట్టాలని ప్రభుత్వానికిడిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి బండారి శివ వ్యవసాయ కార్మిక సంఘం రాప్తాడు నియోజకవర్గం ఉప అధ్యక్షుడు బి రామాంజనేయులు మహిళా సమైక్య మండల నాయుకురాలు ప్రమీల, నారాయణమ్మ, నల్లమ్మ, పెద్దక్క, సిపిఐ పాపం పల్లి శాఖ సెక్రెటరీ గోవిందు, హనుమన్న, రైతు సంఘం ముత్యాలు, ఓబులేసు, నరసింహులు, గోపాల్ నాయుక్, తిరుపాలు. వినోద్, నాగమణి, వెంకట తదితరులు పాల్గొన్నారు,