May 07,2023 15:03

ప్రజాశక్తి-పుట్లూరు : గ్రంథాలయంలో ఈ నెల 8 నుంచి జూన్ 11వ తేదీ వరకు నిర్వహించే సమ్మర్ క్యాంపును ఏర్పాటు చేశారు. మండల కేంద్రములోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి యస్.జయరాములు ఆధ్వర్యంలో సర్పంచ్ రామిగాళ్ళ ఓబులేసు చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవులను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయంలో వివిధ రకాల సైన్స్, క్విజ్, చరిత్ర గల పుస్తకాలు ఉంటాయన్నారు. పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించు కోవాలని కోరారు.