Jun 10,2023 16:58

ప్రజాశక్తి-ముదిగుబ్బ : మండల కేంద్రంలోని గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం కార్యక్రమంలో మండల ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులు పాఠకులతో మాట్లాడుతూ గ్రంథాలయం వ్యవస్థ ద్వారా ఎంతోమంది ఉన్నత చదువులు చదివి పుస్తకాల ద్వారా జ్ఞానంతో పెరిగి నైతిక విలువలతో మానవత్వంతో సమాజంపై అవగాహనలతో ఐఏఎస్ సాఫ్ట్వేర్ డాక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ తదితర డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయికి ఎదిగేకి గొప్ప నిలయం గ్రంధాలయం ప్రతి విద్యార్థిని విద్యార్థులు గ్రంధాలయాన సందర్శించి మంచి పుస్తకాల్లో ద్వారా జ్ఞానం పెంపొందించుకొని ఉన్నత స్థాయికి ప్రతి ఒక్కరూ చేరాలని విద్యార్థిని విద్యార్థులకు ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి బొజ్జే నాయక్ , సిబ్బంది ఖాదర్ భాష పాఠకులు ముని యాదవ్ ఉపాధ్యాయుడు నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.