- వివిధ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానం...
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక శాఖా గ్రంధాలయం నందు విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు (summar camp) మే 8వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు 35 రోజులుగా నిర్వహించారు. ఆదివారం ఈ తరగతులు ముగింపు కార్యక్రమం గ్రంధాలయ అధికారి కె.జీవన ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షులుగా ముఖ్య అధితులుగా రిటైర్ కండక్టర్ ప్రసాద్ హాజరై వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రంధాలయ అధికారి మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థిని లు చిన్నతనం నుడి గ్రంధాలయం నకు వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ప్రముఖులు మాట్లాడుతూ చినిగిన చొక్కా అయినా తోడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే సూక్తిని ప్రబోధించారు అని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది వెంకటేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










