Jun 11,2023 15:03
  • వివిధ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానం

ప్రజాశక్తి-ఆత్మకూరు : మండల కేంద్రంలోని స్థానిక శాఖా గ్రంధాలయం నందు విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు (summar camp) మే 8 వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు 35 రోజులు గా నిర్వహించారు. ఆదివారం ఈ తరగతులు ముగింపు కార్యక్రమం  గ్రంధాలయ అధికారి నల్లమ్మ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సమావేశానికి అధ్యక్షులుగా ముఖ్య అధితులు ఎంపీపీ హేమలత  హాజరై  వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా గ్రంధాలయ అధికారి మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థినిలు చిన్నతనం నుడి గ్రంధాలయం నకు వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ప్రముఖులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని పెన్నులు లెటర్ ప్యాడ్లు అలాంటివి వస్తువులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది ఆడిట్ టీచర్ పెద్దన్న సరళ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.