Mar 31,2023 15:04

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక దుగుమర్రి రోడ్డులో గుజరీ దుకాణం నిర్వహించే సుబహన్(40) గురువారం రాత్రి గుజరీ దుకాణంలోనే  ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండు, మూడు సంవత్సరాల నుండి అప్పులు అధికం కావడంతో కొద్దీ కాలం నుండి తీవ్ర మానసిక వేదనకు గురి అయ్యేవాడు అని  బంధువులు తెలిపారు. మృతునికి భార్య కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య హసీనా ఫిర్యాదు మేరకు సిఐ అస్రార్ భాష కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.