Jul 06,2023 11:26

ప్రజాశక్తి-ఉరవకొండ : సీఎం వైఎస్ జగన్ ఈ నెల 8న కళ్యాణదుర్గం వస్తున్న సందర్భంగా..ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఉరవకొండ వైస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో విశ్వేశ్వరరెడ్డి సమావేశం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ జయంతి, రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గంలో రైతు సభను ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ హాజరైయ్యే ఈ బహిరంగ సభలో 2022 ఖరీఫ్ కు సంబంధించి వాతావరణ బీమా, ఫసల్ బీమా కింద రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు రూ.1,016 కోట్లను సీఎం విడుదల చేయనున్నారని చెప్పారు.ఇందులో ఒక్క అనంతపురం జిల్లాకే రూ.211.80 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. కావున సీఎం వైఎస్ జగన్ పాల్గొనే ఈ భారీ బహిరంగ సభను విజయవంత చేయాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు. ఈ సమావేశంలో పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు వీరన్న,ఎంపీపీ చంద్రమ్మ,వైస్ ఎంపీపీ నరసింహులు, వైస్ సర్పంచు పెన్నోహోబిలం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అశోక్ కుమార్, వైస్సార్సీపీ నాయకులు బసవరాజు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.