- నాణ్యతను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రoలోని నార్పల-1 మరియు నార్పల-3 రైతు భరోసా కేంద్రాలకి శుక్రవారం సబ్సిడీ వేరుశనగ కాయలు రావడం జరిగింది. రైతుల సమక్షంలో వ్యవసాయ అధికారి ముస్తఫా నాణ్యత పరిశీలించడం జరిగింది. ఈనెల 15 నుండి రిజిస్ట్రేషన్ చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది అని సబ్సిడీ పోను క్వింటాలు వేరుశనగ 5500 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఒక బస్తా సబ్సిడీ పోను ₹1674 నిర్ణయించడం జరిగింది. అర్థం ఎకరా లోపు పొలం ఉన్న రైతులకు ఒక బస్తా, అర్థం ఎకరా నుండి ఒక ఎకరా పొలం ఉన్న రైతులకు రెండు బస్తాలు, ఎకరా దాటి పొలం ఉన్న రైతులకు మూడు బస్తాలు పంఫిణి చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు కోరడం జరిగింది.










