May 31,2023 12:26

ప్రజాశక్తి:- చిలమత్తూరు : ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వార పంపిణీ చేసే సబ్సిడి వేరుశనగ కార్యక్రమం స్థానిక వైసిపి ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారి వంశీకృష్ణ ఆద్వరంలో  బుధవారం పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా 1376 మంది రైతులు 1106 క్వింటళ్లకు సబ్సిడి వేరుశనగ కు నమోదు చేసుకోగా ప్రస్తుతం ఆర్బీకే కేంద్రలలో 1300 క్వింటాళ్ల వేరుశనగ అందుబాటులో  ఉందని వ్యవసాయ శాఖ అధికారి వంశీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి సంధ్య,.వైసిపి మండల కన్వినర్ ప్రభాకర్ రెడ్డి, నాగరాజు యాదవ్ ఎంపిటీసి రాఘవేంద్రరెడ్డి,నాయకులు హారి,చౌడప్ప తదితరులు పాల్గొన్నారు.