May 26,2023 14:58
  • సిఐటీయు ఆధ్వర్యంలో ఈఏస్ఐ డిస్పెన్సరీ  హాస్పటల్ వద్ద ధర్నా

ప్రజాశక్తి-భీమవరం : భీమవరంలో ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయాలని, వివిధ పరిశ్రమలు, షాపుల్లో పనిచేస్తున్న కార్మికులందరని  ఈఎస్ఐలో నమోదు చేయించాలని, భీమవరం డిస్పెన్సిరిలో  పర్మినెంట్ వైద్యులని నియమించిలన  డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో భీమవరం ఈఎస్ఐ డిస్పెన్సరీ హాస్పిటల్ వద్ద శుక్రవాo  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు భీమవరం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడారు. భీమవరం పరిసర ప్రాంతం పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించిదని  కానీ వంద పడకల హాస్పిటల్ లేక కార్మికులు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు కార్మికుల జీతాల నుంచి వేల కోట్ల రూపాయలు నిధి ఈఎస్ఐ కార్పొరేషన్ చెల్లిస్తున్నా కార్మికులకు సరైన వైద్య సౌకర్యం అందట్లేదని విమర్శించారు. చిన్న రోగాలకు  కూడా రాజమండ్రి లేక విజయవాడ పంపుతున్నారని దీనివలన కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబందులు పడుతున్నారని అన్నారు. ఈఎస్ఐ భీమవరం డిస్పాన్సరీలో పర్మినెంట్ డాక్టర్ లేక కార్మికులకు వైద్య సహాయం అందడం లేదని మహిళా డాక్టర్ ని  నియమించాలని డిమాండ్ చేశారు. మందులు సరిపడా ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశిపూర్వకంగానే ఈఎస్ఐ హాస్పిటల్స్ ను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం కోసం కార్మికులకు వైద్య సేవలు, నిధులు తగ్గించిందని విమర్శించారు.రానున్న రోజుల్లో కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యాలు మెరుగుపరచకపోతే ఈఎస్ఐ సౌకర్యాలు  పెంచడం కోసం ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. అనంతరం వైద్యలకు  కు  సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు.ఈ ధర్నాలో సిఐటియు జిల్లా నాయకులు ఎం ఆంజనేయులు, ఇంజెటి శ్రీను, కలిపిండి సత్యనారాయణ, కే గోపాల్ రాజు, బంగారు వరలక్ష్మి, బద్ది రాము జి.కనకారావు, మేకల అప్పారావు, అప్పల స్వామి, కృష్ణ బి.చిన్నారావ్ తదితరులు పాల్గొన్నారు.