- ఎస్సై రాజశేఖర్ రెడ్డి
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాలలో సింగనమల సిఐ అస్సార్ భాష ఎస్సై రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మహిళా పోలీసులతో కలిసి సోమవారం మండల కేంద్రమైన నార్పలలోని స్థానిక జూనియర్ కాలేజీని సందర్శించి విద్యార్థినిలతో ఇంట్రాక్ట్ అయ్యి, ర్యాగింగ్ గురించి, ఈవ్ టీజింగ్, దిశా యాప్, బాల్య వివాహాలు ఇతర వాటి గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్తినిలకు కాలేజీలో కానీ, కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కానీ, ఇంటిదగ్గర కానీ ఎవరైనా ఇబ్బంది పెడుతున్న వేధింపులకు గురి చేస్తున్న అటువంటి సమస్యలు ఉన్నవారు ఏ సమస్యలు వచ్చినా వెంటనే మాకు తెలియజేయాలని, లేదా డయల్ 100కు కానీ, దిశా ఎస్ఓఎస్ కు గాని తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలప్ప అధ్యాపకులు కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు స్థానిక పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.










