Jun 24,2023 15:33

ప్రజాశక్తి-ఆచంట.(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ గ్రామంలో  శ్రీ చైతన్య  స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్న  ఈ సంస్థను అధికారులు సీజ్ చేయాలని శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థులు శనివారం  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం మనోజ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు విద్యాసామాగ్రి అమ్మరాదని అన్నారు. కానీ దీనికి విరుద్ధంగా పెనుగొండ శ్రీ చైతన్య విద్యా సంస్థ పాఠశాలలోనే విద్యార్థులకు ప్రభుత్వా నిబంధనలు పాటించకుండా  వేల రూపాయలకు అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారని  ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలను సందర్శించి నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచిన రూమును సీజ్ చేశారు. అనంతరం ఆ పాఠశాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో  ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కే ఈశ్వర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.