ప్రజాశక్తి-సోమల : రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమల విద్యార్థులు అండర్ 14 విభాగంలో ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు శ్రీతుంగ నాగరాజ తెలియజేశారు. 26.10.2023 తేదీన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మునగలపాలెం ఏర్పేడు మండలం నందు జరిగిన జిల్లా స్థాయి టోర్నమెంటు మరియు ఎంపిక పోటీలు యందు అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమల విద్యార్థులు అండర్ 14 విభాగంలో రెడ్డి కిరణ్మయి తొమ్మిదవ తరగతి మరియు సాయి మదన్ ఎనిమిదవ తరగతి ఇద్దరు విద్యార్థులు చిత్తూరు జిల్లా జట్టుకు ఎంపికైనట్లు తెలిపారు. వీరు నవంబర్ నెల 4, 5, 6 తేదీలలో నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణం నందు జరుగు రాష్ట్రస్థాయి బాల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్లో పాల్గొంటున్నట్లు పిడి శ్రీకరుణానిధి తెలిపారు. వీరి ఎంపిక పట్ల విద్యార్థులందరూ వారిని అభినందించారు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.










