May 06,2023 15:50

ప్రజాశక్తి - పెనుమంట్ర : పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ‌‌పెనుమంట్ర హైస్కూల్ విద్యార్థిని గోవిందరాజు హారతి 576 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందని ఎంఈఓ డి శారద జ్యోత్స్న, హెచ్ఎంకె సాయి సూర్యనారాయణరావులు తెలిపారు. ఇక ద్వితీయ స్థానంలో మాముడూరు హైస్కూల్ విద్యార్థిని విఎస్ఎన్ఎల్ కామాక్షి 544 మార్కులు సాధించినట్లు హెచ్ఎం సూర్య కుమారి తెలిపారు. జుత్తిగ హైస్కూల్ విద్యార్థిని బింది దివ్యశ్రీ 542 మార్కులతో తృతీయ స్థానం నిలిచినట్లు హెచ్ఎం ఆర్  మణి భారతి తెలిపారు. అదేవిధంగా మార్టేరు ఎస్విజిహెచ్ హైస్కూల్ లో చోడసాని సత్య వెంకట లోకేష్ 535 మార్కులు సాధించినట్లు సిహెచ్ శివ జ్యోతి తెలిపారు . పొలమూరు హైస్కూల్ లో జొన్నాడ లక్ష్మీ సత్య శ్రీ 535 మార్కులు సాధించినట్లు హెచ్ఎం బండి ఆంజనేయులు అన్నారు. మార్టేరు బసంతి దేవి బాలికల హైస్కూల్ లో అసర యశస్విని 495 మార్కులు సాధించినట్లు ఇంచార్జ్ హెచ్ఎం ఎస్టి గణపతి చెప్పారు. ఆలమూరు హైస్కూల్ లో కేతా చాందిని 475 మార్కులు సాధించినట్లు హెచ్ఎం వి అనంతలక్ష్మి అన్నారు. మొత్తంగా మండలంలో  508 విద్యార్థులకు 282 ఉత్తీర్ణతతో 55.51 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎఈఓ డి శారద జ్యోత్స్న అన్నారు.