Jun 23,2023 13:08

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలలో గత నెల రోజులు పాటు ఎండ వేడిమితో అల్లాడిపోతూ పొట్టకూటి కోసం రిక్షా పై చెత్తను సేకరిస్తూ వచ్చిన ఆదాయం తోనే కుటుంబాన్ని పోషించుకుంటూ సంచార జీవనం సాగిస్తున్నారు. ఈ నేపద్యంలో ఆకాశం ఒక్కసారిగా మేఘాకృతమై చిరుజల్లు కొరవడంతో  సంచార   జీవనం సాగిస్తున్న  కుటుంబ సభ్యులకు కాస్త విశ్రాంతి దొరకడంతో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట శ్రీ రామేశ్వర స్వామి ఆలయం ఆవరణలో ఆదమరిసి  నిద్రపోతున్నారు. వీరికి ఆ రిక్షాబండే బతుకు తెరువు. కనీసం కింద దుప్పటి కూడా లేకుండా వీరు ప్రక్కనుంచి వర్షం దారాలు వెళ్తున్న అవి ఏమి పట్టకుండా ఇన్ని రోజులు సరైన నిద్ర లేకపోవడంతో అలసట బలహీనత ఆరోగ్య సమస్యలతో ఇలా ఆదమరిచి నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారు.  వీరిలో బాల కార్మికులు కూడా ఉన్నారు. బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలిస్తాము బడి ఈడు పిల్లలను బడికి పంపిస్తామంటూ అధికారుల మాటలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. బడికి వెళ్ళవలసిన వయసులోనూ  చిన్నారులు చిత్తు కాగితాలు వేరుకుంటూ బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవలసిన అధికారులు లేకపోవడంతో మీరు సంచారం జీవనం సాగిస్తూ  తల్లిదండ్రులకు సేదోడు వాదోడుగా బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు.