- మండల ప్రత్యేక అధికారి మహమ్మద్ రఫీ
ప్రజాశక్తి-నార్పల : నార్పల మండలంలో వివిధ పాఠశాలల్లో నాడు-నేడు పనులు ఈ నెల ఆఖరిలోపు చేయాలని మండల ప్రత్యేక అధికారి ఆదేశించారు. గురువారం నార్పల మండలంలోని నాడు నేడు పాఠశాలలలో పనుల పురోగతిని మండల ప్రత్యేక అధికారి మహమ్మద్ రఫీ మరియు మండల విద్యాధికారి కృష్ణయ్యతో చర్చించి పనులు జరుగుతున్న బొందలవాడ బీ.పప్పూరు పి.బండ్లపల్లి గొల్లపల్లి పాఠశాలలను సందర్శించి పనులు యొక్క పురోగతినీ ప్రధానోపాధ్యాయులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష చేసి ఈ నెల ఆఖరి లోపల అన్ని పాఠశాలల యందు నాడు నేడు పనులను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు నాడు నేడు పనులు చేస్తున్న గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.










