Mar 22,2023 13:27
  • రైతులతో కలిసి అధికారులను కోరిన శైలజానాథ్

ప్రజాశక్తి-పుట్లూరు : అకాల వర్షానికి దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. పుట్లూరు మండల రైతులతో కలిసి జిల్లా ఉన్నతాధికారులను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారి రఘునాథరెడ్డి, డ్రిప్, ఇరిగేషన్ పిడి పిరోజ్ ఖాన్ కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ వడగండ్ల వానకి రైతాంగం గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరటి, దానిమ్మ, బొప్పాయి, చీనీ, మొక్కజొన్న, టమేటా తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వీటికి స్పందించిన అధికారులు మాట్లాడుతూ ఇన్సూరెన్స్ తో పాటు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. శైలజానాథ్ వెంట డిసిసి అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, పూల ప్రసాద్, విష్ణు నారాయణ, కడవకల్లు, ఓబుళాపురం, దోసలేడు గ్రామాల రైతులు వున్నారు.