Jun 18,2023 15:17
  • అధికారులకు అమ్యామ్యలు      
  • మూడు విభాగాలకు ముడుపులు                               

ప్రజాశక్తి-రోళ్ల : ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారులు భక్షకులుగా మారుతున్నారు. విలువైన ప్రకృతి సంపదను కంటికి రెప్పల భద్రత కల్పించాల్సిన ఆయా శాఖ అధికారులు నల్ల మాఫియాతో చేతులు కలిపి మామూళ్లను  పంచుకుంటున్నారు. మండలంలో  ఇసుక, గ్రావెల్, ఎర్ర మట్టి, కొండ రాళ్లు, చెట్ల కొట్టివేత, ఒంటి ప్రకృతి సంపదలతో పాటు అత్యంత విలువైన తెల్ల రాయిని కూడా కొంతమంది గనులు కొండ గుట్లు కూడా దోచేస్తున్నారు. స్థానిక అధికారుల నుంచి జిల్లాస్థాయి అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారే తప్ప విలువైన సంపదను దోచుకుంటున్న మాఫియా పై కనీస చర్యలు కూడా తీసుకులేక పోతున్నారని ప్రజలు వాపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతోంది. మండలంలో ఇసుక నుంచి మట్టి వరకు ఏది వదలకుండా నిత్యం ట్రాక్టర్లలోనూ, టిప్పర్లలో, లారీలలో, బహిరంగంగా విక్రయిస్తున్నారు. కోట్ల రూపాయిల సంపదను నల్ల మాఫియా కొల్లగొడుతుంటే సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకృతి సంపద దోపిడీలో అత్యధికంగా మైనింగ్ శాఖ, రెవిన్యూ ఫారెస్ట్ పోలీసులకు పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నట్లు ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు బదిలీపై వెళ్లేందుకు పోటీ పడుతున్నారు. అందుకోసం అవసరమైన పోస్టింగ్ కోసం లక్షలు వెచ్చిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆసొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు మాఫియాతో చేతులు కలిపి అక్రమ రవాణాను ప్రోత్సాహ ఇస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయం రాష్ట్ర స్థాయి అధికారులకు తెలిపిన మొక్కుబడిగా తనిఖీలు చేసి మామ అంటున్నారే తప్ప మాఫియాకు పరోక్షంగాను ప్రత్యక్షంగాను సహాయ సహకారాలు అందిస్తున్న అవినీతి రుచి మరిగిన అధికారులపై మాత్రం గట్టి చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఫలితంగా దోచుకో దాచుకో అన్న శైలిలో అధికారులు అక్రమ అర్జునతో చేతులు కలిపి ప్రభుత్వ సంపదను కొల్లగొట్టడం తెర వెనుక పాత్ర పోషిస్తున్న  ప్రభుత్వ ఖజానాకు దగ్గరుండి గండి కొడుతున్నారు.