ప్రజాశక్తి-పాలకొల్లు : జీవితంలో పరీక్షలు ఒక భాగమే కానీ పరీక్షలే జీవితం కాదని, ఒకసారి ఫెయిల్ అయినా ఎవరూ కృoగి పోకుండా పట్టుదలతో మరల ప్రయత్నించాలని వాకర్స్ క్లబ్, పాలకొల్లు అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ అన్నారు. పాలకొల్లు బ్రాడీపేట ఏ.వి.ఎస్.ఎన్.మున్సిపల్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్లో చిరు ఆహారాన్ని క్లబ్ తరపున అందించిన సందర్భంగా రూ 9 వేలను పాఠశాల హెచ్ఎం విష్ణుమూర్తికి ఆదివారం అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్ మాట్లాడుతూ విద్యార్ధి జీవితంలో పదవ తరగతి ఒక కీలక మలుపు అని ప్రతి విద్యార్థి సమయాన్ని వృథా చేయకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం ఆర్. విష్ణుమూర్తి అధ్యక్షత వహించగా క్లబ్ కోశాధికారి పోతుల ఉమా శంకర్ రావు, ఉపాధ్యక్షుడు ధనాని శ్రీరామమూర్తి, ఉపాధ్యాయులు ఎమ్. సురేష్, ప్రసాదరాజు, కే.గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










