ప్రజాశక్తి-నార్పల : నార్పల మండలం ఎస్సై రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మందకృష్ణ మాదిగ నాయకత్వంలోఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగాచేయడం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకుడు పుల్లప్ప మాట్లాడుతూ ప్రజల కోసం ఎంతో తపనపడుతూ బడుగు బలహీన వర్గాలకు ఏమి సమస్య వచ్చినా తన సమస్యగా భావించి వెంటనే అందించే మంచి మనసున్న అధికారి అని అన్నారు. వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల్లోనే తాను ఒక్కడిగా మెదుగుతున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. ఎస్సై జన్మదిన సందర్భంగా పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు పాత్రికేయులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సైకి పూలమాలలు శాలువా వేసి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగాపురం పుల్లప్ప, సీనియర్ నాయకులు గడ్డం నాగేపల్లి హనుమంతు, గడ్డం నాగేపల్లి, గంగయ్య, గొల్లపల్లి ఈరప్ప, నార్పల రాజు కేశపల్లి, పెద్దిరాజులు, తుంపెర రామ్మోహన్, తుంపెర రమణయ్య, తుంపర రామకృష్ణ, తుంపెర రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.










